ముచ్చట్లు

ముచ్చట్లు

Saturday, 13 June 2026

Trusted, Unbiased & Verified Local Short News

Latest News June 2026
LIVE

మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం

మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం
మైత్రివనంలో భారీ అగ్నిప్రమాదం
  • మైత్రివనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 13 షటర్లు పూర్తిగా దగ్ధమై సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణకు వాన అలర్ట్

తెలంగాణకు వాన అలర్ట్
తెలంగాణకు వాన అలర్ట్
  • ఆదిలాబాద్, జనగాం, సిద్దిపేట, మెదక్‌లో తీవ్ర ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి.
  • మరో 2 గంటల్లో కామారెడ్డి, సిరిసిల్ల, ఆసిఫాబాద్, వరంగల్, హన్మకొండకు విస్తరించనున్నాయి.

సూర్య కుమార్ కు షాక్ !

సూర్య కుమార్ కు షాక్ !
సూర్య కుమార్ కు షాక్ !
  • భారత టీ20 జట్టు కెప్టెన్ పదవి నుంచి సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించినట్లు సమాచారం

ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?

ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?
ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమా?
  • ప్రాంతీయ వాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
  • మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వేరుపడాలనే డిమాండ్‌తో 58 రోజుల పాటు ఆత్మబలిదానం చేసిన Potti Sreeramulu ఉద్యమాన్ని కూడా ప్రాంతీయ వాదంగానే పరిగణిస్తారా అని ప్రశ్నించారు.
  • తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులు గుజరాత్‌కు వెళ్లడం ప్రాంతీయ వాదం కాదా అని నిలదీశారు. జాతీయవాదం పేరుతో జరుగుతున్న ఆర్థిక ప్రాంతీయ వాదాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.

కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో పైలాన్ ను ఆవిష్కరించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు

  • హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.
  • రెండో విడతలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం

తెలుగు రాష్ట్రాలకు ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా AMB క్లాసిక్ విక్టరీ

  • 📌 సౌత్ ఇండియాలో ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన AMB సినిమాస్ హైదరాబాద్‌లో సరికొత్త ఐమాక్స్ స్క్రీన్‌ను తీసుకురాబోతోంది.
  • 📌 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకైక ఐమాక్స్ స్క్రీన్‌గా ‘AMB క్లాసిక్ విక్టరీ’ మల్టీప్లెక్స్ రికార్డు సృష్టించనుంది.
  • 📌 సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, ఏషియన్ గ్రూప్ సంయుక్తంగా ఈ భారీ థియేట్రికల్ ప్రాజెక్ట్‌ను అందిస్తున్నారు.
  • 📌 హైదరాబాద్ సినీ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 70MM థియేటర్ ప్రాంగణంలోనే ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ రూపుదిద్దుకుంటోంది.

తెలంగాణలో నేటి నుండి పెరిగిన కనీస వేతనాలు అమలు

తెలంగాణలో నేటి నుండి పెరిగిన కనీస వేతనాలు అమలు
తెలంగాణలో నేటి నుండి పెరిగిన కనీస వేతనాలు అమలు
  • తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుండి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
  • కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

రథోత్సవంలో విషాదం.. యువకుడి మృతి

రథోత్సవంలో విషాదం.. యువకుడి మృతి
రథోత్సవంలో విషాదం.. యువకుడి మృతి
  • తమిళనాడులోని తిరుచెంగోడు అర్ధనారీశ్వర స్వామి రథోత్సవంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
  • రథం చక్రం కింద పడి 19 ఏళ్ల హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
  • మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, వెన్నెముక విరగడంతో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
  • ఘటన స్థలాన్ని మంత్రులు పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జూన్ 6న ఢిల్లీలో సీజేపీ వ్యవస్థాపకుడి నిరసన

  • 📌 సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జూన్ 6న భారత్‌కు తిరిగి రానున్నారు.
  • 📌 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ప్రకటించారు.
  • 📌 కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.
  • 📌 నిరసన కార్యక్రమానికి మద్దతుగా పలువురు కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

“ఏపీ నేతలపై కవిత ఘాటు వ్యాఖ్యలు”

“ఏపీ నేతలపై కవిత ఘాటు వ్యాఖ్యలు”
“ఏపీ నేతలపై కవిత ఘాటు వ్యాఖ్యలు”
  • తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు – సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత కల్వకుంట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
  • మంత్రి లోకేష్ తెలంగాణలోకి విస్తరిస్తామని చెబుతున్నారని కవిత ప్రస్తావించారు.
  • పవన్ కళ్యాణ్ తెలంగాణ నవనిర్మాణం పేరుతో తెలంగాణలో సభ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
  • కూటమి ప్రభుత్వంలో ఉన్న మీరు, ముందుగా అమరావతి సచివాలయం, సీఎం కార్యాలయానికి వర్షపు నీరు రాకుండా చూడాలని సూచించారు.
  • ప్రతి వానాకాలంలో అమరావతి మునిగిపోతుందని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవమానకరమని విమర్శించారు.
  • రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా రాజధాని నిర్మాణం జరగలేదని అన్నారు.
  • ఇప్పటికీ వైద్యం, ఇతర అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలపై ఆధారపడుతున్నారని వ్యాఖ్యానించారు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రజల అవసరాల కంటే రాజకీయ అవసరాల కోసమే తెలంగాణపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
  • తెలంగాణ వాదులు రాజకీయంగా పరిణతి చెందినవారని, రెచ్చగొట్టే రాజకీయాలకు స్పందించే పరిస్థితిలో లేమని స్పష్టం చేశారు.
  • ఇక్కడ ఆంధ్ర నేతల ఏజెంట్ ముఖ్యమంత్రి ఉండటం వల్లే రకరకాల విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.
  • తాము అధికారంలోకి వస్తే ఆ విగ్రహాలను తొలగించి ఆంధ్రప్రదేశ్‌కు పంపిస్తామని కవిత వ్యాఖ్యానించారు.

పవన్‌పై పొన్నం ఫైర్

పవన్‌పై పొన్నం ఫైర్
పవన్‌పై పొన్నం ఫైర్
  • పైసలు ఇస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి నటన అయినా చేస్తారని పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
  • ఏ డ్రెస్ అయినా వేసుకొని ఎగురుతారని పవన్‌పై వ్యాఖ్యలు చేశారు.
  • నవ నిర్మాణ సభలను గుజరాత్, కేరళ, తమిళనాడులో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
  • సభల నిర్వహణపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు శ్రీకారం

ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు శ్రీకారం
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు శ్రీకారం
  • సీఎం రేవంత్ రెడ్డి రేపు ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతను ప్రారంభించనున్నారు.
  • రెండో దశలో కొత్త లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.
  • అర్హులైన పేద కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం అందించడమే లక్ష్యంగా చర్యలు.
  • ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కార్డులు లేవు.. కోతలు మాత్రం మొదలు.. !

కార్డులు లేవు.. కోతలు మాత్రం మొదలు.. !
కార్డులు లేవు.. కోతలు మాత్రం మొదలు.. !
  • ఈహెచ్ఎస్ ట్రస్ట్, హెల్త్ కార్డులు, ఆస్పత్రులతో ఒప్పందాలు లేకుండానే ఉద్యోగుల జీతాల నుంచి 1.5% ప్రీమియం కోత.
  • ఉద్యోగుల అనుమతి, ముందస్తు ఉత్తర్వులు లేకుండానే కోతలు విధించడంపై తీవ్ర అసంతృప్తి.
  • నెలకు రూ.907 నుంచి రూ.3,750 వరకు కోతలు పడుతుండగా, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే రెండుసార్లు ప్రీమియం వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు.
  • కుటుంబ వివరాలు అప్‌లోడ్ చేయని ఉద్యోగుల జీతాల నుంచీ కూడా ప్రీమియం కట్ కావడంపై ఉద్యోగ సంఘాల అభ్యంతరం.
  • సేవలు అందుబాటులోకి రాకముందే డబ్బులు వసూలు చేయడం ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమైంది.
  • రాష్ట్ర అవతరణ దినోత్సవం వేళ ఉద్యోగులకు శుభవార్త బదులు అదనపు కోతలు షాక్ ఇచ్చాయి.
  • "ముందు హెల్త్ కార్డులా..? ముందు కోతలా..?" అన్న ప్రశ్న ఉద్యోగుల్లో వినిపిస్తోంది.
  • చట్టపరమైన ప్రక్రియ పూర్తి కాకుండానే జీతాల నుంచి కోతలు వేయడం వివాదాస్పదంగా మారింది.
  • ఉద్యోగుల సమ్మతి లేకుండా కోతలు వేయడం రాజ్యాంగ, కార్మిక హక్కుల ఉల్లంఘనగా ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
  • మార్గదర్శకాలు విడుదల చేసి, కోతలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాల డిమాండ్.